ఏపీలో స్థానిక ఎన్నికల పర్వం ముగిసింది. దీనితో దేశ రాజకీయాలు ఒక్కసారిగా త్వరలో 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల మీద తమ దృష్టిని సారించారు. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా సర్వేలు వస్తున్నా....కానీ రెండు రాష్ట్రాల్లో మాత్రం రాజకీయం రోజు రోజుకీ ఉత్కంఠను పెంచుతున్నాయి. ఒకటి మమతా బెనర్జీ నేతృత్వం వహిస్తున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం...మరొకటి అస్సాం... ఇప్పటికే అస్సాం రాష్ట్రంలో కమలనాథులకు మంచి పట్టు ఉంది.