సాధారణంగా ఇప్పటి వరకు జరిగిన విధానాలను బట్టి చూస్తే దేశంలో ఎటువంటి ఎన్నికలను అయినా జరపవలసిన బాధ్యత పూర్తిగా ఎన్నికల సంఘానిదే. ఎందుకంటే మన రాజ్యాంగం అలా పొందుపరచబడి ఉంది. ఎన్నికల సంఘం అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. వీరికి ఎవరితోనూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధాలు ఉండవు. వీరి పని కేవలం ఎక్కడ ఎన్నికలు జరిగినా వీరి పాత్ర కీలకం.