ఏపీలో అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈరోజు ఉదయం నుండి ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు చూస్తే వైసీపీ మొదటి నుండీ కూడా ఎక్కడా తడబాటు లేదు. స్పష్టంగా ఫలితాలలో ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది. పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి ఫలితం అయితే వచ్చిందో, ప్రస్తుతం కూడా ఆ దిశగా అధికార పార్టీ దూసుకు వెళుతోంది.