అందరూ అనుకున్నట్టుగానే వైసీపీ తన జోరును మరింత వేగంగా కొనసాగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలల్తో ప్రారంభమయిన ఫ్యాను గాలి...పంచాయతీలు, నగరపాలక ఎన్నికలు ఇలా వచ్చిన ప్రతి ఎన్నికల్లోనూ విజయమే లక్ష్యంగా దూసుకుపోతోంది. అయితే ఈ సారి కొంచెం గట్టిగానే ఫ్యాను గాలి వీచింది అని చెప్పాలి. ఏపీలో రాజకీయ ఉద్దండుల కంచుకోటలను సైతం బద్దలు కొట్టింది.