ప్రస్తుతం రాష్ట్రమంతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో లభించిన విజయాన్ని వైసీపీ కార్యకర్తలు మరియు నాయకులు సంతోషంగా జరుపుకుంటున్నారు. ఎప్పుడూ స్థానిక ఎన్నికలలో ఇంతటి ఘన విజయం దక్కింది లేదు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు వైసీపీ ప్రభజనం ముందు నిలువలేక పోయాయి. మరో సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్ కు అద్వితీయమైన విజయాన్ని కట్ట బెట్టారు.