ఎట్టకేలకు నిమ్మగడ్డ తన పంతాన్ని నెగ్గించుకునే ప్రయత్నంలో చివరి అంకానికి చేరుకున్నాడు. దీనితో ఏపీ ప్రభుత్వాన్ని మరియు అధికార పార్టీని పరోక్షంగా దెబ్బతీసినట్లయింది. అయితే జగన్ ఈ విషయంపై ఇంకా పోరాడడం విడ్డూరంగా ఉంది. ప్రస్తుతం తెలిసిన సమాచారం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది.