హమ్మయ్య..ఎట్టకేలకు ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా పూర్తయిపోయాయి. ప్రజలంతా సమిష్టిగా వైసీపీకి భారీ విజయాన్ని అందించారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలలో వైసీపీకి విజయ శాతం పెరిగిందని చెప్పవచ్చు. మొత్తంగా ఏపీలో 75 మునిసిపాలిటీలలో ఎన్నికలు జరుగగా, అందులో మొత్తం 2122 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులలో అధికార వైసీపీకి మొత్తం 1762 తమ వశమయ్యాయి.