తాజాగా వచ్చిన మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఎంతో మంది ప్రతిపక్ష రాజకీయ నాయకులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. దీనికి కారణం వైసీపీ అఖండ విజయమే. మరో సారి వైసీపీకి తిరుగు లేదు అని నిరూపించిన ఫలితం ఇది. చరిత్రలో స్థానిక ఎన్నికలలో ఈ స్థాయి ఫలితాన్ని చూడడం ఇదే మొదటి సారి. అయితే ఈ ఎన్నికలలో ఓటమిపై టీడీపీ ఎప్పటిలాగే కుంటిసాకులు చెబుతూ ఉండగా, మరి కొందరు విశ్వసనీయమైన నాయకులు ఓటమిని అంగీకరించి, మా తరపున జరిగిన తప్పులను సరిదిద్దుకుంటామని పశ్చత్తాపపడ్డారు.