ప్రస్తుతం ఏపీలో టీడీపీకి సంబంధించిన యువతరం నాయకులు సొంత పార్టీపై మంచి ఆగ్రహంతో ఉన్నారు. 2014 లో వైసీపీని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు ఎన్నెన్నో వ్యూహాలను పన్నారు. అందులో ఒకటి భారతీయ జనతా పార్టీ మరియు జనసేనలతో పొత్తు పెట్టుకోవడం. ఇది ఎంతో సక్సెస్ అయింది. తద్వారా చంద్రబాబు సీఎం అయ్యారు. అంతే కాకుండా అటు ఇటు కాకుండా ఉన్న తటస్థ ఓటర్లను కూడా టీడీపీ వైపుకు ఆకర్షితులయ్యేలా చేసింది.