విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన సమస్య ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రైవేటీకరణ పేరుతో ఏపీలోని ప్రముఖ వైజాగ్ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికీ విదితమే. ఇక అది మొదలు ఏపీలో రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని వాడుకుని రాజకీయం చేయడానికి రెడీ అయిపోయాయి. దీనికి తోడు అదే సమయంలో నగర పాలక స్థానిక ఎన్నికలు ఉండడంతో మరింత చురుకుగా అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను రచించారు.