గడిచిన ఏపీ స్థానిక ఎన్నికల్లో వారి ఓటమికి ఒక్కో పార్టీ ఒక్కో రకంగా కారణాలను చెప్పుకుంటున్నాయి. మాములుగా ఓటమి వచ్చినప్పుడు దానికి సాకులు చెప్పుకోవడం సహజమే. అయితే ఆ సాకులు కొంచెం కొత్తగా ఉంటే ప్రజలు అంగీకరిస్తారు. అంతే కానీ కనీసం ఊహించడానికి కూడా ఘోరంగా ఉంటే, ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో వైఫల్యం గురించి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ ఒక భిన్నమైన ప్రకటన చేయడం రాజకీయ వర్గాలలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి ఈ వ్యాఖ్యలేమిటో ఒకసారి తెలుసుకుందాము.