గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న కాలంలో కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు గ్రామాల్లో నిర్వహించేవారు. ఉదాహరణకు జన్మభూమి కార్యక్రమం అని నిర్వహించేవారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆకస్మిక తనిఖీలు జరిగేవి. ఈ విషయం అప్పట్లో కార్యక్రమంలో ఉన్న వారికి ఎవరికీ తెలియకుండా జరుగుతూ ఉండేవి. ఆ ప్రాంత ప్రజలకు గానీ, అక్కడకు వచ్చిన అధికారులకు గానీ లేదా మీడియా మిత్రులకు గానీ ఎవ్వరికీ ఎటువంటి సమాచారం ఉండేది కాదు.