మాములుగా ఎంతో మంది విద్యార్థులు ఎంతో కష్టపడి చదువుకుని డాక్టర్ లేదా ఇంజినీర్ లుగా మారి విదేశాలలో స్థిరపడుతూ ఉంటారు. అక్కడైతే భారీగా సంపాదించుకోవచ్చు అనే ఒక ఆశయంతో, అయితే ఎక్కువగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో స్థిరపడం చూస్తూ ఉంటాము. ఈ నేపథ్యంలో భాగంగానే భారతదేశం నుండి మరియు చైనా నుండి ఎక్కువ మొత్తంలో డాక్టర్స్ మరియు నర్స్ లు అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది.