ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దెబ్బకు టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. వైసీపీ దెబ్బకు టీడీపీ అడ్రెస్ గల్లంతయ్యే పరిస్తితి వచ్చింది. అయితే అధికార పార్టీ కాబట్టి వైసీపీకి ఫుల్ అడ్వాంటేజ్ ఉంది. అలాగే జగన్ పాలన పట్ల ప్రజలు ఇంకా నమ్మకంతో ఉన్నారు. అందుకే ఎన్నికల్లో టీడీపీకి భారీ నష్టమే జరిగింది. అయితే టీడీపీకి వైసీపీతోనే కాకుండా జనసేన వల్ల కూడా బాగానే నష్టం జరిగింది. 2019 ఎన్నికల్లోనే జనసేన ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి పెద్ద బొక్క పడింది. అలాగే వైసీపీకి ప్లస్ అయింది.