తెలంగాణలో రాజకీయాలు మళ్ళీ ఊపందుకుంటున్నాయి. రెండు రోజుల క్రిందటే ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి తగ్గడంతో, ఇప్పుడు మళ్ళీ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే ఉప ఎన్నికతో సందడి షురూ అయింది. దీనితో అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలలో భాగమై ఉన్నారు. ఇప్పటికే కసి మీద ఉన్న భారతీయ జనతా పార్టీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో విజయం సాధించడం కోసం ఇప్పటికే ముఖ్య నేతలతో క్షేత్ర స్థాయిలో కార్యకర్తలను మరియు ఓటర్లను ప్రభావితం చేసే దిశగా ప్రణాళికలు పూర్తి చేశారు.