కోడెల శివప్రసాద్....ఏపీ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడు. పల్నాడు ప్రాంతానికి దశాబ్దాల పాటు సేవ చేసిన నాయకుడు. ఐదు సార్లు నరసారావుపేట నుంచి ఒకసారి సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యే గా గెలిచిన కోడెల, నవ్యాంధ్ర తొలి స్పీకర్గా పనిచేశారు. ఇక 2019 ఎన్నికల్లో ఓడిపోయిన కోడెల మీద అనేక ఆరోపణలు రావడంతో, ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన విషయం అందరికీ తెలిసిందే.