ప్రస్తుతం ఏపీలో స్థానికలు ముగిసిన అనంతరం తిరుపతి ఎంపీ ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చింది. దీనితో అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికపై వ్యూహాలకు సిద్ధం అయిపోయారు. గత కొద్ది రోజుల క్రితమే వైసీపీ మరియు టీడీపీ తమ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ బీజేపీ మరియు జనసేన పార్టీలు మాత్రం అభ్యర్థిని అప్పట్లో ప్రకటించలేదు.