ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ ఎంత ప్రధానమైన అంశమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే ఎన్నో వేల ఎకరాలు భూమి పంట పొలం వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని వలన ఎన్నో కుటుంబాలు హాయిగా జీవించవచ్చు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి కావలసి ఉన్నా కొన్ని రాజకీయ కారణాల వలన ఆలస్యం అవుతూ వచ్చింది.