ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల అన్ని రాజకీయ పార్టీ ల ఎంపీ అభ్యర్థులు ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఇక మిగిలింది ప్రచారం మరియు ఎన్నికలు మాత్రమే. దీనితో ఒకవైపు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మరియు బీజేపీ - జనసేన కూటమి గెలుపు సమీకరణాలలో తలమునకలై ఉన్నారు. ఈ సందర్భంగా అన్ని పార్టీల అభ్యర్థుల కన్నా ఎక్కువ దృష్టి వైసీపీ అభ్యర్థి అయిన మద్దిల గురుమూర్తి మరియు బీజేపీ జనసేన అభ్యర్థి అయిన కత్తి రత్న ప్రభ ల మీదనే నెలకొంది.