ఏపీలో మరో సమరానికి రంగం సిద్ధమైంది. తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గా ప్రసాద్ అకాల మరణంతో ఖాళీ అయిన ఆ సీటుకు ఉప ఎన్నికను జరపనున్నారు. నిన్ననే ఉప ఎన్నికలు నామినేషన్ పూర్తయింది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో పాల్గొంటున్న అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలిచేందుకు అన్ని రకాలుగా సమాయత్తమవుతున్నారు. దొరికన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు వెళుతున్నారు.