2019 ఎన్నికల తర్వాత చాలామంది నాయకులు టీడీపీకి దూరమైన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో టీడీపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఘోరంగా ఓడిపోయి 23 సీట్లకు పరిమితం కావడంతో, పలువురు నాయకులు అధికార వైసీపీలోకి జంప్ చేసేశారు. అలాగే కొందరు బీజేపీలోకి కూడా వెళ్లారు. ఇక మరికొందరు నేతలు రాజకీయాల్లో కనిపించడం లేదు. ఇంకొందరు నేతలు సైలెంట్‌గా ఉంటున్నారు.