ఏపీలో మళ్ళీ మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. ఒకవైపు ప్రతి పక్ష టీడీపీతో పాటు కొని వైసీపీ వ్యతిరేఖ పార్టీలు మూడు రాజధానుల అంశానికి అడ్డు తగులుతుంటే...వైసీపీ మాత్రం ఖచ్చితంగా రాజధాని వికేంద్రీకరణ చేసి తీరుతాం అంటూ ఆ వ్యవహారాల్లో ముందుకు వెళుతున్నారు. అయితే ఇప్పుడు కేంద్రలో అధికారంలో ఉన్న ఎన్డీయే పక్షమయిన బీజేపీ మూడు రాజధానుల అంశంలో ఒకటి అయిన కర్నూలు లో హై కోర్ట్ ఏర్పాటుపై ఇచ్చిన సమాధానం ఇప్పుడు కీలకంగా మారనుంది.