తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్ళు పూర్తయ్యాయి. అయితే ఈ 40 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు అతి పెద్ద సంచలన నిర్ణయం తీసుకున్నారు. తొలిసారి ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలని బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. అధికార వైసీపీ ఎన్నికల సమయంలో దౌర్జన్యాలకు పాల్పడుతుందని, తమ కార్యకర్తలని బాగా ఇబ్బంది పెడుతుందని, పైగా కొత్తగా వచ్చిన ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని పూర్తిగా జగన్ మనిషి అని విమర్శలు చేస్తూ, చంద్రబాబు ఎన్నికలని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.