ఏపీలో నిరంతరం ఏదో ఒక ఎన్నికలతో ప్రజలు మరియు రాజకీయ నాయకులు బిజీ గా ఉంటున్నారు. మొన్న స్థానిక ఎన్నికలు ముగియడంతో తిరుపతి ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది...అది కాస్తా ఎన్నికలకు అడుగుదూరంలో నిలిచి ఉంది. వచ్చే వారంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ లోపు గడిచిన స్థానిక ఎన్నికలను నిర్వహించిన ఏపీ ఎస్ ఈ సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం మార్చి తో ముగియడంతో, ఏపీ ప్రభుత్వం నీలం సాహ్ని ని ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా నియమించింది.