ఏపీలో గడిచిన స్థానిక ఎన్నికలు ఎంతో వివాదాస్పదంగా జరిగిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల కిడ్నాప్ లు, దౌర్జన్యాలు, తోపులాటలు ఇలా ఎన్నో జరిగాయి. చివరికి వైసీపీ బలపరిచిన అభ్యర్థులే అటు గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ మరియు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లోనూ ఎక్కువ స్థానాల్లో విజయాన్ని సాధించారు. అయితే వీటి వెనుక ఎన్నో అన్యాయాలు జరిగినట్లుగా తెలుస్తోంది.