ఏపీలో గడిచిన స్థానిక ఎన్నికలు ఏ విధంగా జరిగాయో మనకు తెలిసిందే. ఎన్నో వివాదాలు, ఎన్నో గొడవలు, దౌర్జన్యాలు నడుమ ఈ ఎన్నికలు ముగిశాయి. తెలుగు దేశం పార్టీకి సంబంధించినటువంటి విశాఖపట్నంలోని ఓ కార్పొరేటర్ అభ్యర్థి తనను టిడిపి పార్టీ వాళ్లే నమ్మించి మోసం చేశాడంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఆధారాలను సైతం బయటపెట్టడం జరిగింది.