దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నిన్న తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో విజయం వరించేది డీఎంకే నే అని ఇప్పటికే జోరుగా ప్రచారాలు ఊపందుకున్నాయి. మరో వైపు సర్వే ఫలితాలు కూడా ఈ పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే మన భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా దేశంలోని రాజకీయాలు కేవలం కొన్ని కులాల చుట్టూనే తిరుగుతున్నాయి.