ఏపీలో ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేకుండా వైసీపీ హవా ఉన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లోనే టీడీపీకి ఏ మాత్రం ఛాన్స్ లేకుండా వైసీపీ ప్రతి జిల్లాలోనూ సత్తా చాటింది. అలాగే ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో సైతం వైసీపీ అదిరిపోయే విజయాలని సొంతం చేసుకుంది. ఇక పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి వన్‌సైడ్ విక్టరీనే దక్కనుంది.