ప్రస్తుతం అందరి దృష్టి తిరుపతి ఉప ఎన్నికల మీద పడింది. ఈ ఎన్నికలను ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇందులో భాగంగానే అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. వైసీపీ ప్రధాన ఫేవరెట్ గా ఎన్నికల బరిలోకి దిగుతోంది. కానీ తాజాగా చూస్తే తిరుపతి ఎన్నికల అజెండానే పూర్తిగా మారిపోయిన సందర్భాలు కనిపిస్తున్నాయి.