ఏదైనా ఒక అంశాన్ని అది చెడు కానీ లేదా మంచి కానీ ప్రతి ఒక్కరికీ తొందరగా సమాచారం తెలియడానికి ఉపయోగించేది సామజిక మాధ్యమం. ప్రస్తుత కాలంలో దీనిని ఉపయోగించని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇదే సోషల్ మీడియాను రాజకీయంగా ఉపయోగించడంలో అన్ని పార్టీలు ముందుంటాయని చెప్పాలి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో తమ తమ అజెండాను ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి సోషల్ మీడియా చాలా బాగా ఉపయోగపడుతుంది.