భారతదేశంలోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎంత పెద్ద చర్చకు దారి తీసిందో తెలిసిన విషయమే. అయితే ఈ ఆలయ నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరించింది. నిధుల సేకరణకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. అనేక మంది దాతలు భారీగా విరాళాలు సమర్పించారు.