తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ నియిజకవర్గానికి ఉప ఎన్నికల పర్వం ఈ రోజుతో పూర్తి కానుంది. నిన్నటి వరకు అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంతో, డబ్బుల పంపిణీతో ఓటర్లను ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయా...? ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపనున్నారో తెలిసే రోజు వచ్చేసింది. ఈ రోజు దానికి సంబంధించిన పోలింగు కాసేపట్లో ప్రారంభమయింది.