ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగు దేశం పార్టీ ప్రస్తుతం ఏపీలో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఇలా జరగడానికి రాజకీయంగా చాలా కారణాలు ఉన్నాయి. అయితే టీడీపీకి ఏదీ కలిసి రావడం లేదని చెప్పాలి. ముఖ్యంగా ఎన్నికలయితే అస్సలు వీరికి అనుకూలంగా ఉండట్లేదు. ఏపీలో మొన్నీమధ్యనే జరిగిన గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వ్యవహారం బెడిసి కొట్టింది.