ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్‌లో కరోనా తీవ్రత ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. కరోనా రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఇక ఎమర్జెన్సీ బెడ్స్ సంగతి సరేసరి. రోజంతా పడిగాపులు కాస్తున్నా ఖాళీ లేదు పొమ్మంటున్నారు.