కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం ప్రజలను కంటిపై కునుకు లేకుండా చేస్తోంది.అయినా జీవనోపాధి నిమిత్తం ప్రజలు బయటకు రాక తప్పడం లేదు. ఇదే కరోనాకు మరింత అనువుగా మారి తన తీవ్రతను రోజురోజుకు పెంచేస్తుంది. మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైనప్పటికీ మొదట్లో పలు రకాల అనుమానాలు, నెగటివ్ ప్త్రాచారాలు ప్రజల్ని వ్యాక్సిన్ వైపు అడుగు పడనివ్వలేదు.