దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన పెంచుతున్నాయి. అదే విధంగా కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడంతో, మరింత భయం చుట్టుముడుతోంది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో అత్యవసర పడకలు దొరకట్లేదు. ఆక్సిజన్ అందుబాటులో లేక కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతోంది.