మాములుగా రాజకీయాలలో ప్రతీకార పూరితంగా వ్యవహరించడం సహజమే. అయితే కొన్ని సార్లు ప్రతీకారం కోసం చేసే రాజకీయం మనకు ఉపయోగపడకపోగా, కొన్ని సందర్భాలలో మనకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. రాజకీయంగా వేరొకరిని అణగదొక్కాలనే ఉద్దేశ్యంతో వారిని వెంటాడి వారిపై కేసులు పెట్టినా, అవతలి వారిని బలహీనపరచకపోగా...పరోక్షంగా వారిని బలవంతులను చేయడమే అవుతుంది.