ఈ మాయదారి వైరస్ మన దేశానికి వచ్చి ఏడాది దాటిపోయింది. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో...మళ్ళీ "నేను మళ్ళీ వచ్చేసా..." అంటూ మన జీవితాల్లోకి ప్రవేశించింది. ఇది గతంలో ఉన్న మొదటి దశ కరోనా కన్నా ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ రెండో దశలో ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి ఒకరి నుండి మరొకరికి చాలా వేగంగా జరుగుతున్నట్టు వారు గుర్తించారు.