ప్రస్తుతం కోవిడ్ 19 మరింత ప్రమాదకరంగా మారి... శర వేగంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడం ఎంతో కీలకంగా మారింది. అయితే మొదట్లో ప్రజలు వ్యాక్సిన్ పై వచ్చిన నెగటివ్ ప్రచారాలు విని టీకా తీసుకునేందుకు వెనుకంజ వేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు వ్యాక్సిన్ డోసులు తీసుకోవడం తప్పనిసరి అయినందున... మనసులో ఏదో మూల అసంతృప్తితోనే వ్యాక్సిన్ తీసుకున్నారు.