రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా టీడీపీ సీనియర్ నేత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈయన అప్పటికే సంగం డైరీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డైరెక్టుగా నరేంద్ర ఇంటి దగ్గరకు 100 మంది పోలీసులతో వచ్చిన ఏసీబీ అధికారులు తమ వాహనంలోనే తీసుకెళ్లారు. అరెస్ట్ కి గల కారణాలను ఏసీబీ ఈ విధంగా వివరించింది.