శ్రీలంక దేశంలో ఎప్పటి నుండో స్థిరపడిన తమిళియన్స్ వారి అస్తిత్వం కోసం పోరాడుతున్న విషయం తెలిసిందే. అప్పట్లో తమిళనాడు నుండి తమిళ ప్రజలు శ్రీలంకకు వలస వెళ్లి అక్కడే స్థిరపడి పోయారు. ఇక అప్పటి నుండి వారికంటూ ప్రత్యేక గుర్తింపు కావాలని, అక్కడ ఉన్నటువంటి తమిళులకు ప్రత్యేక తమిళ రాజ్యం కావాలని శ్రీలంక ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు.