ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తన విజృంభణ కొనసాగిస్తోంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం సెకండ్ వేవ్ ప్రమాదంగా సాగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి భారీగా పెరిగింది. దేశంలో పెరుగుతున్న కరోనా రోగుల సంఖ్య చూస్తుంటే... టెన్షన్ తో చమటలు పడుతున్నాయి. ఈ వైరస్ యొక్క ప్రమాద స్థాయి కూడా పెరగడంతో... కరోనా సోకిన ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.