గత ఏడాది నుండి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పుడొచ్చిన కరోనా సెకండ్ వేవ్ అయితే మరింత ప్రమాదకరంగా మారింది. కంటికి కనిపించని ఈ వైరస్ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. కొంత మందిపై ఈ వయసు ప్రభావం తక్కువగానే ఉండి త్వరగానే కోలుకుంటున్నప్పటికీ.. కొందరు ఈ వైరస్ దాడికి తమ ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.