ప్రపంచమంతా కరోనా వైరస్ సృష్టించిన బీభత్సంతో అల్లకల్లోలంగా మారిపోయింది. దేశంలో ప్రజలు భయభ్రాంతులతో కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మిగిలిన దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ఆరోగ్య సదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. సామాన్యులకు ప్రభుత్వ ఆసుపత్రిలే దిక్కు...కానీ అక్కడ ఈ కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలకు ఏమాత్రం చికిత్స అందుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.