ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తన పంజా విసురుతోంది ప్రళయాన్ని సృష్టిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి వేగం, ప్రభావం ఏ రేంజ్ లో ఉందంటే వీధి వీధికి కరోనా పేషెంట్లు ఉంటున్నారు. ముంబై , ఢిల్లీ, వంటి ప్రాంతాలలో వైరస్ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. చాలా ప్రదేశాల్లో కరోనా టెస్ట్ లు తగిన స్థాయిలో జరగకపోవడంతో... కరోనానో కాదో అని తెలియకుండానే కొందరు ప్రజలు లక్షణాలతో బాధపడుతున్నారు.