రాజకీయాల్లో మీడియా పాత్ర ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక నాయకుడుని పైకి లేపాలన్న లేదా కింద పడేయాలన్న మీడియాదే ప్రధాన పాత్ర. అయితే ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీకి సొంత మీడియాలు ఉండటం ఎక్కువైపోయాయి. ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా మరో పార్టీపై విమర్శలు చేయడం, అలాగే తమ పార్టీని పైకి లేపే ప్రయత్నం చేయడం చేస్తున్నాయి. అసలు ఏపీలో ప్రధాన ప్రత్యర్ధులుగా ఉన్న వైసీపీ, టీడీపీలకు సొంత మీడియాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే.