దేశమంతా కరోనా వైరస్ సెకండ్ వేవ్ దారుణంగా ఉంది. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి. గత రెండు రోజుల నుండి మరణాల శాతం కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాలలో అక్కడి కరోనా వ్యాప్తిని ఆధారంగా చేసుకుని లాక్ డౌన్ విధించాయి.