ప్రపంచాన్ని కరోనా వైరస్ కమ్మేస్తున్న వేళ... వ్యాక్సిన్ వస్తే తప్ప మరో మార్గం లేదని... ఈ వైరస్ అంత సులువుగా అంతమయ్యేది కాదని ఆరోగ్య నిపుణులు తేల్చి చెప్పేశారు. దాంతో ప్రపంచ దేశాలన్నీ కరోనాను అంతమొందించే వ్యాక్సిన్ సిద్ధం చేసేందుకు పరుగులు తీశాయి. చివరికి కొన్ని దేశాలు వ్యాక్సిన్లు కనుగొన్నాయి. కానీ అవసరమున్న మేరకు భారీ స్థాయిలో టీకాలు ఉత్పత్తి చేయడం అంత సులువేమీ కాదు.