కనికరం లేని కరోనా ప్రపంచ ప్రజలను కబలించేస్తోంది. మన దేశంలోనూ వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయికి చేరుకుని దేశ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. లక్షలు దాటుతున్న కేసులే ఈ మహమ్మారి ఉదృతి కి నిదర్శనం. వేల మరణాలు ఈ కాలాంతక కనికరం లేని వైరస్ కోరల విషానికి సాక్ష్యం. ఇలా దేశమంతటా ఎక్కడ చూసినా కరోనా విలయతాండవం చేస్తోంది.