ప్రస్తుతం కరోనా కారణంగా దేశమంతా అస్తవ్యస్తంగా మారుతోంది. ఈ దశలో తెలుగు రాష్ట్రమైన తెలంగాణాలో ఒక భూ కబ్జా వివాదం సంచలనంగా మారింది. తెలంగాణ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ భూ కబ్జాకు పాల్పడ్డారని మెదక్ జిల్లా మూసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు ఫిర్యాదు పత్రాన్ని నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అందించడం జరిగింది.